: మరో పోరాటం... నేటి నుంచి కన్నయ్య సహా జేఎన్‌యూ విద్యార్థుల నిరాహార దీక్ష
తమ నాయకుడు కన్నయ్యపై జరిమానా, విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడంపై నేటి నుంచి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ నిరాహార దీక్షకు దిగనున్నారు. దీనిలో భాగంగా నేడు గంగా ధాబానుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించి, నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అఫ్జల్ గురు ఉరిశిక్ష అమలు పరచి ఏడాది గడిచిన సందర్భంగా జేఎన్‌యూలో సదరు ఉగ్రవాది ఉరితీతకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంపై విచారించిన ఉన్నతస్థాయి కమిటీ కన్నయ్యకు రూ.10 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మరి కొందరు విద్యార్థులు కూడా వర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తమపై విచారణకు కమిటీని వేయడాన్ని గతంలో తాము వ్యతిరేకించామని, ఇప్పుడు ఆ కమిటీ నివేదిక ప్రకారం వర్సిటీ తమపై బహిష్కరణ విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్టూడెంట్ లీడర్ కన్నయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.