: జగన్... ఓ అపరిచితుడు!: వైసీపీ అధినేతపై మైసూరా ఘాటు వ్యాఖ్యలు


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం వైసీపీకి రాజీనామా చేస్తూ నాలుగు పేజీల లేఖ రాసిన మైసూరా... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ వ్యవహారశైలిని తూర్పారబట్టారు. జగన్ వ్యవహారం అపరిచితుడు క్యారెక్టర్ ను తలపిస్తోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మానవీయ కోణంలోనే తాను వైసీపీలో చేరానన్న ఆయన... జగన్ కు మాత్రం మానవీయ కోణం లేదన్నారు. కుటుంబ సభ్యుల్లో చిచ్చుపెట్టే సంస్కృతి ప్రజాస్వామ్యంలో ఉండదన్న మైసూరా... పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగానే కాక కనీసం ఫోన్ లో కూడా జగన్ దొరకరని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News