: తిరుమల కొండపై మరో అపచారం... చక్కర్లు కొట్టిన విమానం
తిరుమల కొండపై మరో అపచారం జరిగింది. ఈరోజు ఉదయం తిరుమల ఆలయం పైనుంచి ఓ విమానం ప్రయాణించింది. తిరుమల పైనుంచి విమానం వంటి ప్రయాణ సాధనాలు వెళ్లడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని టీటీడీ పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంపై నుంచి విమానం ప్రయాణించడాన్ని చూసిన భక్తులు షాక్ కి గురయ్యారు. ఈ ప్రదేశాన్ని నో ప్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలోనూ పలు సార్లు ఇటువంటి ఘటనలు జరిగాయని తెలిపారు. కొండపై నుంచి విమానం వెళ్లడాన్ని చూసిన భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.