: వైఎస్ జగన్ కు భారీ ఎదురుదెబ్బ!... వైసీపీకి మైసూరారెడ్డి రాజీనామా!


ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో తల పట్టుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో భారీ ఎదురు దెబ్బ తగలనుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి వైసీపీకి మరికాసేపట్లో రాజీనామా చేయనున్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతో ఉన్న మైసూరా... పార్టీ వీడేందుకే నిర్ణయించుకున్నారు. నేటి ఉదయం 10 గంటలకు పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన లేఖ రాయనున్నారు. ఈ లేఖను మైసూరా నేరుగా జగన్ కే పంపనున్నట్లు తెలుస్తోంది. పార్టీ వీడేందుకు దారి తీసిన అన్ని కారణాలను కూడా మైసూరా... తన రాజీనామా లేఖలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. జగన్ సొంత జిల్లా కడపకే చెందిన మైసూరారెడ్డి పార్టీ వీడటం వైసీపీకి తీరని నష్టమేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News