: ఖమ్మం... గులాబీమయం!: మరికాసేపట్లో టీఆర్ఎస్ ప్లీనరీ
తెలంగాణలోని ఖమ్మం నగరం గులాబీమయమైపోయింది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తన 15వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడ ఫ్లీనరీని ఏర్పాటు చేసింది. మరికాసేపట్లో పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్టీ కీలక నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తల సమక్షంలో ప్లీనరీ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ నేపథ్యంలో నగరం మొత్తం గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఈ ప్లీనరీలో ఏకంగా 15 తీర్మానాలను ఆమోదించేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఖమ్మం జిల్లాకే చెందిన పాలేరు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అక్కడే ప్లీనరీ ఏర్పాటుపై సర్వత్ర చర్చ జరుగుతోంది.