: నాపై కోర్టులో కేసు వేయడం చాలా బాధనిపించింది: కారెం శివాజీ


తనపై కోర్టులో కేసు వేయడం చాలా బాధనిపించిందని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. ఒక దళిత నాయకుడికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని ఇవ్వడంపై ప్రతిపక్ష పార్టీ జీర్ణించుకోలేకపోయిందని, అందుకే తనపై కోర్టులో కేసు వేయించిందని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, తనకు కోర్టు మీద, తీర్పుల మీద నమ్మకం, గౌరవం వున్నాయని అన్నారు. ఒక ఉద్యమనాయకుడిగా అనేక ఉద్యమాలు చేశానని, ప్రజల పక్షాన పోరాటం చేశానని, కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని కారెం శివాజీ అన్నారు.

  • Loading...

More Telugu News