: సూపర్ కిడ్ లక్ష్మీశ్రీజ ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్... బంగారు గొలుసు బహూకరించిన ఎంపీ కవిత
రేపు జరగనున్న ప్లీనరీలో పాల్గొనేందుకు ఖమ్మం వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సూపర్ కిడ్ లక్ష్మీ శ్రీజ ఇంటికి వెళ్లారు. ఆమెతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చరిత్రను శ్రీజ గుక్కతిప్పుకోకుండా చెప్పింది. కేసీఆర్ తో పాటు ఆయన కూతురు, ఎంపీ కవిత, తుమ్మల నాగేశ్వరరావు, జెడ్పీ చైర్ పర్సన్ కవిత ఉన్నారు. బాలమేధావి లక్ష్మీశ్రీజ బాధ్యతలను ఎంపీ కవితకు కేసీఆర్ అప్పగించారు. ఈ సందర్భంగా శ్రీజకు కవిత బంగారు గొలుసు బహూకరించింది. కాగా, తాను ఖమ్మం వస్తే కనుక లక్ష్మీ శ్రీజ ఇంటికి వెళతానని కేసీఆర్ గతంలో అన్నారు. ఈ మేరకు ఆయన బాలమేధావి నివాసానికి వెళ్లారు. సీఎం తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.10 లక్షలు లక్ష్మీశ్రీజకు గతంలో ఇచ్చిన విషయం తెలిసిందే.