: ప్రెస్ కావచ్చు, పోలీసు కావచ్చు, ఎవరైనాసరే ప్లీనరీలో క్రమశిక్షణతో వుండాలి!: టీఆర్ఎస్ నేత తుమ్మల


ప్రెస్ కావచ్చు, పోలీసు కావచ్చు... ఎవరైనా సరే రేపు జరగబోయే ప్లీనరీలో క్రమశిక్షణగా ఉండాలని టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో పార్టీ ప్లీనర్ రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరూ పొరపాటు చేయకుండా, జాగ్రత్తగా ఉంటూ ఈ ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. ఖమ్మం జిల్లాలో ఈ ప్లీనరీ నిర్వహించడం ఒక వరమని అన్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు రాత్రింబవళ్లు కష్టించి పనిచేసిన నాయక శ్రేణులందరికీ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

  • Loading...

More Telugu News