: దావూద్ ఇబ్రహీం పూర్తి ఆరోగ్యంతో ఫిట్‌గా ఉన్నాడు: చోటా షకీల్


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై అతని కుడి భుజం చోటా షకీల్ స్పందించాడు. దావూద్ ఇబ్ర‌హీం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడ‌ని చెప్పాడు. దావూద్‌కి ప్రాణాంతక వ్యాధి సోకిందని వస్తోన్న వార్త‌ల‌ను తిప్పికొట్టాడు. 60 యేళ్ల దావూద్‌ కాళ్లకు గ్యాంగ్రేన్ సోకిందని, ఇప్పటికే అతడి కాళ్లలోని చాలా వరకూ కండరాలు పాడైపోయాని, త్వరలో కాళ్లు తొలగిస్తామని వైద్యులు తెలుపుతున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని వ్యాఖ్యానించాడు. దావూద్ కు ఎలాంటి అనారోగ్యం కాలేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం దావూద్ పూర్తి ఆరోగ్యంతో ఫిట్‌గా ఉన్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News