: పింఛన్ మంజూరు చేయటం లేదంటూ నాలుక కోసుకున్న వికలాంగుడు


హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంలో కలకలం రేగింది. తనకు పింఛన్ మంజూరు చేయడం లేదంటూ రాజు అనే వికలాంగుడు బ్లేడుతో తన నాలుక కోసుకున్నాడు. ఈ సంఘటన ‘సి’ బ్లాక్ ఎదుట జరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లోని సూరారానికి చెందిన రాజు తన పింఛన్ విషయమై సీఎం కార్యాలయానికి వెళ్లాడు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News