: నాకు స్థిరాస్తులు లేవు.. నా భార్య‌లే నా ఆస్తులు.. వాళ్లకి ఆస్తులున్నాయి: క‌రుణానిధి


తమిళనాడులో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ దాఖలు చేసిన అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తన ఆస్తులు రూ.113.73 కోట్లుగా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అయితే, మ‌రోవైపు డీఎంకే అధినేత క‌రుణానిధి త‌న‌కు వేరే ఆస్తులు అంతగా లేవ‌ని, త‌న‌కున్న ఆస్తులు త‌న భార్య‌లు దయాళు అమ్మాళ్‌, రాజాత్తి అమ్మాళ్‌లు మాత్రమేనని పేర్కొన్నారు. అయితే, త‌న భార్య‌ల ఆస్తులు రూ.62.99 కోట్లుగా పేర్కొన్నారు. త‌న‌కు స్థిరాస్తులు లేవ‌ని పేర్కొన్న క‌రుణానిధి.. చ‌రాస్తులు మాత్రం రూ.13.42 కోట్లుగా తెలిపారు. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా త‌న ఆస్తుల వివ‌రాలపై ఇదే విధంగా స్పందించారు. అప్ప‌డు తన భార్యల ఆస్తుల విలువ రూ.41.13 కోట్లుగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News