: తిరుపతిలో యువ దంపతుల ఆత్మహత్య.. చనిపోయే ముందు సెల్ఫీ, సెల్ఫ్ వీడియో
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యువదంపతులు తిరుమల పుణ్య క్షేత్రానికి వచ్చి అక్కడే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. వీరిని సంపత్ కుమార్, సత్యవాణిగా గుర్తించారు. అక్కడి ఓ గెస్ట్ హౌస్ లో గదిని అద్దెకు తీసుకున్న దంపతులు.. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు, వారు చనిపోయే ముందు ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ తమను తాము వీడియో కూడా తీసుకున్నారు. చనిపోయే ముందు సెల్ఫీ లు సైతం దిగారు. ఇరువురి మృత దేహాలను పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.