: బోరుబావిలో పడ్డ ఏడు నెలల చిన్నారి మృతి.. తీవ్రంగా ప్రయత్నించినా దక్కని ఫలితం
బోరుబావికి మరో పసి ప్రాణం బలైంది. గుజరాత్ సురేంద్రనగర్ ప్రాంతంలోని బోరుబావిలో నిన్నరాత్రి పడిపోయిన ఏడు నెలల చిన్నారి మృతి చెందింది. పాపను కాపాడేందుకు రెస్క్యూ టీమ్ ఎంతగా ప్రయత్నించినా ఆ పసిప్రాణం నిలవలేదు. ఐదు గంటల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి చివరికి ప్రాణాలు విడిచింది. బోరుబావిలో పడిపోయిన చిన్నారిని రక్షించేందుకు ఐదుగంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్ చివరకు పాపను బయటకు తీసుకు వచ్చింది. అయితే అప్పటికే పాప ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.