: విజ‌య‌వాడలో విషాదం.. ప్రాణం తీసిన నూడిల్స్


విజ‌య‌వాడ య‌న‌మ‌లకుదురులో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్లలోపు వయసు ఉన్న ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఎంతో ఇష్టంగా తిన్న నూడిల్స్ ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి. గ‌డువు తీరిన నూడిల్స్ తిన‌డంతో అక్క‌ మాన‌స అక్క‌డి కక్క‌డే మృతి చెందింది. ఆమె ఇద్ద‌రు చెల్లెళ్లు మ‌మ‌త, థెరిస్సా ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అక్కాచెల్లెళ్లు నూడిల్స్‌తో పాటు థ‌మ్స‌ప్ కూడా తాగిన‌ట్లు తెలుస్తోంది. చెల్లెళ్లు మ‌మ‌త, థెరిస్సా ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ ల‌భించిన‌ న్యూడిల్స్ ను ప‌రీక్ష‌ల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

  • Loading...

More Telugu News