: దయచేసి క‌న్న‌య్య చేసిన త‌ప్పేంటో ఎవరైనా చెప్పండి?: ట‌్విట్ట‌ర్‌లో దిగ్విజ‌య్‌


ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యం స్టూడెంట్ యూనియ‌న్ లీడర్ క‌న్న‌య్య కుమార్ చేసిన త‌ప్పేంట‌ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్ర‌శ్నించారు. అఫ్జ‌ల్ గురు ఉరిశిక్ష అమ‌లు ప‌ర్చి ఏడాది గ‌డిచిన సంద‌ర్భంగా వ‌ర్సిటీ స‌ద‌రు ఉగ్ర‌వాది ఉరితీత‌కు వ్య‌తిరేకంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంపై విచారించిన ఉన్న‌త‌స్థాయి క‌మిటీ క‌న్న‌య్య‌కు రూ.10 వేల జరిమానా విధించిన విషయం విధిత‌మే. దీనిపై దిగ్విజ‌య్ సింగ్ తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... కన్నయ్యను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దయచేసి ఆయ‌న‌ చేసిన నేరమేంటో ఎవరైనా వివ‌రిస్తారా? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఈ విష‌య‌మై క‌న్న‌య్యను దోషిగా నిరూపించ‌డానికి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News