: పేరు ఆంగ్లంలోనే అయినా... శిలాఫలకం మాత్రం అచ్చ తెలుగులో!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిన్న తెల్లవారుజామున ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాత్కాలిక సచివాలయానికి ప్రారంభోత్సవం చేశారు. సమీపంలో సుముహూర్తాలు లేనందున తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి కాకున్నా, రెండు గదులను సిద్ధం చేసి వాటికే ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఓ కీలక అడుగు వేసింది. అమరావతిలో ఇప్పటిదాకా జరిగిన ప్రారంభోత్సవాలకు సంబంధించిన అన్ని శిలాఫలకాలు ఆంగ్లంలోనే ఉన్నాయి. అయితే... తాత్కాలిక సచివాలయానికి ‘ఏపీ గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్ క్వార్టర్స్’గా ఆంగ్లంలో నామకరణం చేసిన ప్రభుత్వం శిలాఫలకాన్ని మాత్రం అచ్చ తెలుగులో రూపొందించింది.

  • Loading...

More Telugu News