: రాజ్యసభ సభ్యత్వం నుంచి మాల్యాను తొలగించాలి: రాజ్యసభ నైతిక విలువల కమిటీ
బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వ్యాపార వేత్త, రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాకు మరో ఎదురు దెబ్బతగిలింది. విజయ్ మాల్యా ఉదంతంపై న్యూఢిల్లీలో రాజ్యసభ నైతిక హక్కుల కమిటీ ఈరోజు సమావేశం అయింది. చర్చలు జరిపిన అనంతరం రాజ్యసభ సభ్యత్వం నుంచి విజయ మాల్యాను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా మాల్యా డబ్బు లావా దేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆర్థిక నేరస్తుడిగా భారత విదేశాంగ శాఖ ఆయనపై చర్యలకు దిగిన సంగతి తెలిసిందే.