: టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు... పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన కేసీఆర్


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు వారు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ పార్టీ కండువాలు కప్పి వారిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన పువ్వాడ అజయ్ పార్టీ మారుతున్నారనే సమాచారంతో ఆ పార్టీ శాసనసభాపక్షనేత జానారెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన ఫారూక్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించారు. 1986-91 మధ్య సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ గా చేశారు. 2005-07 మధ్య మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కొనసాగారు. 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News