: నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజు మన స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 159.21 పాయింట్లు నష్టపోయి 25,678.93 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 44.25 పాయింట్ల నష్టంతో 7,855.05 వద్ద క్లోజయింది. ఎన్ఎస్ఈలో భారతీ ఎయిర్ టెల్ సంస్థ షేర్లు అత్యధికంగా 1.66 శాతం లాభపడి రూ.358.95 వద్ద ముగిశాయి. లాభపడ్డ మరిన్ని సంస్థల షేర్ల విషయానికొస్తే.. అంబుజా సిమెంట్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, బీపీసీఎల్ సంస్థలు ఉన్నాయి. ఇక అత్యధికంగా షేర్లు నష్టపోయిన వాటిలో ‘రిలయన్స్’ ఉంది. ఈ సంస్థ షేర్ అత్యధికంగా 2.35 శాతం నష్టపోయి రూ.1,041.55 వద్ద ముగిసింది. ఇంకా నష్టాలు మూటగట్టుకున్న సంస్థలలో టాటా మోటార్స్ డీవీఆర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతీ, ఎన్టీపీసీ ఉన్నాయి. కాగా, డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.66.69 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News