: రామకృష్ణా మఠం అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి విషమం
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణా మఠం, రామకృష్ణా మిషన్ ల అధ్యక్షుడు స్వామి ఆత్మస్తానంద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఛాతి ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఆయన సుమారు ఏడాది కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వయస్సు పైబడటం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుహితానంద ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రామకృష్ణా మఠం, రామకృష్ణా మిషన్ ల 15వ అధ్యక్షుడిగా 2007లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆత్మస్తానంద స్వామీజీని తన గురుతుల్యులుగా ప్రధాన నరేంద్ర మోదీ భావిస్తారు. సుమారు వారం రోజుల క్రితం స్వామీజీని మోదీ పరామర్శించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆత్మస్తానంద వయసు 97 సంవత్సరాలు.