: నిబంధ‌న‌లు ఉల్లంఘించి తీవ్రమైన తప్పు చేశా.. ఢిల్లీ వాసులు, సీఎం కేజ్రీవాల్‌కు సారీ: ఎంపీ ప‌రేశ్ రావ‌ల్


ఢిల్లీలో వాహనాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో కేజ్రీవాల్ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్‌కు చేరుకోవ‌డానికి ఎంపీల‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం స్పెష‌ల్ డీటీసీ బ‌స్ స‌ర్వీసుల‌ని ప్ర‌వేశ‌పెట్టింది. అయిన‌ప్ప‌టికీ వాటిని ఉప‌యోగించుకోకుండా బీజేపీ ఎంపీ, సినీ న‌టుడు ప‌రేశ్ రావ‌ల్ త‌న వ్య‌క్తిగ‌త కారునే ఉప‌యోగించుకున్నారు. ఈ రోజు బేసి నెంబర్ల కార్లను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు. అయితే, ప‌రేశ్ రావ‌ల్ స‌రిసంఖ్య వాహ‌నంలో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లారు. ఆపై నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు జ‌రిమానా చెల్లించారు. చివ‌రికి ఏమ‌నుకున్నారో ఏమో కానీ స‌రిసంఖ్య వాహ‌నాన్ని ఉప‌యోగించినందుకు సీఎంకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ‘తీవ్ర‌మైన త‌ప్పు చేశా.. ఢిల్లీ వాసులు, సీఎం కేజ్రీవాల్‌కు సారీ’ అంటూ ట్వీట్ చేశారు. ప‌రేశ్ రావ‌ల్‌తో పాటు ప‌లువురు బీజేపీ ఎంపీలు కూడా ఈ రోజు బేసి నెంబర్ల విధానాన్ని ఉల్లంఘించిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News