: కుచేలుడి వేషంలో చిత్తూరు ఎంపీ!... ‘హోదా’ కోసం ఢిల్లీలో వినూత్న నిరసన!
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటుతో సతమతమవుతున్న నవ్యాంధ్రపై కేంద్రం శీతకన్ను వేసిన వైనంపై టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ (చిత్తూరు) కొద్దిసేపటి క్రితం వినూత్న నిరసనకు దిగారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన నగరంలోని విజయ్ చౌక్ వద్ద కుచేలుడి వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శివప్రసాద్ వినూత్న నిరసన అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం శివప్రసాద్ పలు వేషాల్లో నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.