: ముఖేశ్ అంబానీ కొత్త కారు అదిరిందోచ్!... రూ.27 కోట్లు ఖర్చుపెట్టిన రిలయన్స్ అధినేత


లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అడ్రెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ. తండ్రి ధీరూభాయి అంబానీ నెలకొల్పిన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించే పనిలో నిత్యం బిజీబిజీగా గడిపే ముఖేశ్ అంబానీ జీవన శైలి విభిన్నమనే చెప్పాలి. తనకిష్టమైన స్నాక్స్ కోసం ఇప్పటికీ రోడ్ సైడ్ బాట పడుతున్న ఆయన తన ఇంటి విషయానికి వచ్చేసరికి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ‘అంటీలియా’ పేరిట ఆయన ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు విశ్వవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ముఖేశ్ కొనుగోలు చేసిన ఓ కారుపై కూడా పెద్ద చర్చే నడుస్తోంది. నెదర్లాండ్ లో తయారైన ఈ కారు చూడ్డానికి ఓ మినీ బస్సులానే ఉంది. ఈ కారు ఎక్కేందుకు ఏకంగా విమానం స్టెప్స్ తరహాలో వినూత్న ఏర్పాటు ఉంది. ఇక ఈ కారు ఖరీదు విషయానికి వస్తే... రూ.25 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఈ కారుకు ట్యాక్స్ ల పేరిట అంబానీ రూ.1.82 కోట్లు చెల్లించారట. అత్యాధునిక సాంకేతికతో కూడిన ఈ కారులో సౌకర్యాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ఈ కారు లోగిలి మొత్తం కూల్ కావడానికి పట్టే సమయం ఎంతో తెలుసా?... కేవలం 22 సెకన్లలోనే ఈ కారు కూల్ అయిపోతుందట.

  • Loading...

More Telugu News