: 'చలాకీ' చంటి గాడికి పెళ్లి అయిందోచ్, నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి: 'జబర్దస్త్' హాస్యనటుడు వేణు
పాప్యులర్ తెలుగు కామెడీ ప్రోగ్రాం 'జబర్దస్త్' ద్వారా మంచిపేరు సంపాదించుకున్న 'చలాకీ' చంటి నిన్న పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని చంటి సహచర నటుడు వేణు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపాడు. 'ఈ రోజు మా చంటి గాడికి పెళ్లి అయిందోచ్.. నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి... హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా' అంటూ చంటికి వేణు శుభాకాంక్షలు తెలిపాడు. చంటి నిశ్చితార్థం ఈ ఏడాది మార్చి 23న ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని చంటి అప్పట్లో తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపాడు. ఇటీవలే మరో జబర్దస్త్ హాస్యనటుడు షకలక శంకర్ కూడా శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.