: 5 అంగుళాల స్క్రీన్, 3జీ, ఆండ్రాయిడ్ మార్ష్ మాలోతో రూ. 3,999కి మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్ 2


తొలిసారిగా స్మార్ట్ ఫోన్ ను వాడాలని భావించే వారు టార్గెట్ గా మైక్రోమ్యాక్స్ సంస్థ మరో ఆకర్షణీయ ఫీచర్లతో ఉన్న స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ మాధ్యమంగా రూ. 3,999కి కాన్వాస్ స్పార్క్ 2 అమ్మకాలు ప్రారంభించినట్టు తెలిపింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ మార్ష్ మాలో సహాయంతో పనిచేస్తుందని, 5 అంగుళాల స్క్రీన్, 1 జీబీ రామ్, 8 గిగాబైట్ల మెమొరీ, 5/2 ఎంపీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలుంటాయని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుభాజిత్ సేన్ వెల్లడించారు. 3జీ, వైఫై, మైక్రో యూఎస్బీ సదుపాయాలున్నాయని, ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ కు మారాలని భావించే వారికి ఈ ఫోన్ సరిగ్గా సరిపోతుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News