: శ్రీవారి సాక్షిగా మహిళ చేతి వాటం... హుండీ వద్ద లక్ష కాజేసిన వైనం


తిరుమల వెంకన్న సన్నిధిలో ఓ మహిళ చేతివాటం చూపింది. వెంకన్న దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడి బ్యాగు నుంచి రూ.లక్ష కాజేసింది. అది కూడా ఆలయం లోపల... శ్రీవారి హుండీకి అతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై తిరుమల విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న దర్శనానంతరం ఓ భక్తుడు... హుండీలో కానుక వేసేందుకు వెళ్లాడు. సదరు వ్యక్తిని ముందు నుంచే గమనిస్తూ వచ్చిన ఓ మహిళ... ఆ వ్యక్తి హుండీలో కానుక వేస్తుండగా, అతడి బ్యాగులో నుంచి లక్ష నగదును తీసేసుకుంది. అయితే ఆమె చేతివాటం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీకి చిక్కేసింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన విజిలెన్స్ అధికారులు షాక్ తిన్నారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ కోసం గాలింపు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News