: క్రికెట్ బాల్ తగిలి కుప్పకూలిన లంక ఓపెనర్ కౌశల్ సిల్వ
శ్రీలంక టెస్టు క్రికెట్ జట్టులో ఓపెనర్ గా రాణిస్తున్న కౌశల్ సిల్వ, ఓ దేశవాళీ మ్యాచ్ ఆడుతూ, బాల్ తగిలి కుప్పకూలాడు. షార్ట్ లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన బాల్ అతన్ని తాకిందని, వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించామని జట్టు మేనేజర్ సేనానాయకే తెలిపారు. మెరుగైన చికిత్స కోసం కొలంబోకు తరలించినట్టు తెలిపారు. బాల్ తగిలే సమయంలో సిల్వ తలకు హెల్మెట్ ఉందని, దీనివల్ల ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. కాగా, లంక తరఫున 24 టెస్టు మ్యాచ్ లు ఆడిన సిల్వ, 31 సరాసరితో 1,404 పరులుగు చేశాడు. మే నెలలో ఇంగ్లండ్ పర్యటన చేయాల్సిన నేపథ్యంలో, ప్రాక్టీసుగా జరుగుతున్న సన్నాహక మ్యాచ్ లో సిల్వ గాయపడ్డాడు.