: రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనే!.... రుణ మాఫీ!: చంద్రబాబు


నవ్యాంధ్రప్రదేశ్ లో రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని గడచిన ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీనే ఆయనకు అధికారాన్ని కట్టబెట్టింది. రుణాల మాఫీతో అప్పుల్లో నుంచి బయటపడతామన్న ఉద్దేశంతో రైతులు, మహిళలు టీడీపీకి ఓటేశారు. ఎన్నికల్లో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ రాగా, చంద్రబాబు సీఎం పీఠం ఎక్కారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. నేటి తెల్లవారుజామున గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రుణ మాఫీ ప్రకటనకు గల కారణాలను చెప్పారు. రైతులు, మహిళల కళ్లల్లో ఆనందం చూడాలన్న భావనతోనే రుణమాఫీకి శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఓ దఫా రుణమాఫీ చేశామని, తాత్కాలిక రాజధాని ప్రారంభోత్సవం సందర్భంగా రెండో విడత రుణమాఫీకి సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేశానని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేసి తీరతామని చంద్రబాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News