: నన్ను 'బక్కాంజనేయ' అనేవారు: అనంత శ్రీరామ్
చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు తాను పౌరాణిక నాటకాలు ఆడుతూ, ఏకపాత్రాభినయాలు చేసేవాడినని పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు సరస్వతీ శిశు మందిర్ లో చదువుకున్నానని చెప్పారు. ఆర్ష సంస్కృతి గురించి ఎక్కువగా అక్కడ నేర్పించేవారని, అలాంటి విద్యా వ్యవస్థలో చదువుకోగలగడం తన అదృష్టమని అన్నారు. ఎల్కేజీలో ఉండగా ‘భక్తాంజనేయ’ ఏకాపాత్రాభినయం చేశానని, అయితే తాను సన్నగా వుండడం వల్ల, అప్పుడు తనను అందరూ ‘బక్కాంజనేయ’ అని పిలిచేవారని అనంత శ్రీరామ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.