: సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత లేఖ
సీఎం కేసీఆర్ కు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత లేఖ రాశారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు సహకరించాయని, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా సహకరించాలని కోరారు. రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లాకు మరువలేని సేవలు చేశారని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.