: బాలకృష్ణ ఏదైనా మాట చెబితే అది సొసైటీలోకి చొచ్చుకుపోతుంది: బోయపాటి
‘బాలకృష్ణ గారు ఏదైనా మాట చెబితే అది సొసైటీలోకి చొచ్చుకుపోయేంత స్థాయిలో ఉంటుందని ఆయన ఉన్నారు. ఆయనతో చేసే చిత్రాల్లో చాలా హీట్ ఉంటుంది... ఉండాలి ’ అని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అన్నారు. హీరోను బట్టి పాత్ర ఉంటుందని, ఏ హీరోతో మనం చేస్తున్నామనేది ముఖ్యమని అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా మాట్లాడారు. తన చిత్రాల్లోని హీరో సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఏమీ ఉండడని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఎవరికి వాళ్లు కరెక్టుగా ఆలోచిస్తే ఒకళ్లను నిందించాల్సిన అవసరం ఉండదని, అదే తన 'సరైనోడు' చిత్రంలో హీరో పాత్ర అని బోయపాటి పేర్కొన్నారు.