: చంద్రబాబుపై కోపముంటే వ్యక్తిగతంగా చూసుకో: పురందేశ్వరికి గంటా శ్రీనివాసరావు హెచ్చరిక
కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె, ప్రస్తుత బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర హెచ్చరికలు చేశారు. కడప పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుపై కోపం, వ్యక్తిగత కక్షలు ఉంటే, వాటిని వ్యక్తిగతంగానే చూసుకోవాలని, బీజేపీ నేతగా, పాలన బాగాలేదని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. గత బడ్జెట్ లో రాష్ట్రానికి తక్కువ నిధులిచ్చారని, చేతనైతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం కష్టపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించవద్దని హెచ్చరించారు.