: ఫలించిన తుమ్మల మంత్రాంగం... టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్!


తెలంగాణలో కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలు జరగనున్న వేళ, జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి, పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా మంత్రాంగం నడిపి ఈ ఉదయం అజయ్ తో చర్చలు జరుపగా, ఆపై తన ముఖ్య అనుచరులతో మాట్లాడి అభిప్రాయం తెలుసుకున్న పువ్వాడ, తెరాసలోకి జంప్ చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. రేపు హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో లేదా బుధవారం జరిగే టీఆర్ఎస్ ప్లీనరీలో అజయ్ పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News