: నా గర్ల్ ఫ్రెండ్ కంటే 'ఓలా' చౌక... కొత్త యాడ్ పై విమర్శలు!
మైక్రో క్యాబ్ సేవలను పరిచయం చేస్తూ, ఓలా విడుదల చేసిన టీవీ కమర్షియల్ విమర్శల పాలైంది. ఢిల్లీలో సరి-బేసి విధానం అమలవుతున్న వేళ, క్యాబ్ లను ఆశ్రయించే ప్రజల నుంచి అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఓలా, తాజాగా, ఈ యాడ్ తో మరిన్ని ఇబ్బందులో పడింది. యువతీ యువకులు షాపింగ్ చేస్తున్నట్టు ప్రారంభమయ్యే ఈ యాడ్ లో, యువతి షాపింగ్ కు యువకుడు డబ్బు చెల్లిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతని పర్సు ఖాళీ కాగా, "గర్ల్ ఫ్రెండ్ ను డేటింగ్ కు తీసుకురావడం కన్నా ఓలా మైక్రో క్యాబ్ బుక్ చేసుకోవడం చౌక" అని అతను అనడాన్ని ఇందులో చూపారు. కిలోమీటరుకు రూ. 6తో ప్రయాణించవచ్చని చూపుతూ ప్రకటన ముగుస్తుంది. ఇప్పుడీ యాడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.