: ఎడారి నేలపై రెట్టింపు దిగుబడి!


జైసల్మేర్... రాజస్థాన్ లోని థార్ ఎడారి సమీపంలో ఇసుక నేలలతో కూడిన ప్రాంతం. ఎప్పుడూ తీవ్ర కరవుతో, పొడి నేలలతో ఉండే ప్రాంతం ఈ సంవత్సరం రెట్టింపు పంట దిగుబడిని నమోదు చేసింది. ఇక్కడి పొలాల్లో జీలకర్ర, చనా, గసగసాలు తదితరాలతో పాటు కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు పండుతాయి. గత సంవత్సరం రూ. 150 కోట్ల విలువైన దిగుబడి రాగా, ఈ ఏడు అది రూ. 300 కోట్లకు పెరిగింది. పంజాబ్ నుంచి వచ్చే ఇందిరా గాంధీ కెనాల్ లో నిత్యమూ నీరు ప్రవహించడమే అద్భుత పంట దిగుబడికి కారణమని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం రూ. 200 కోట్ల విలువైన శనగ పంట చేతికందిందని వివరించారు. దిగుబడితో మండీలు నిండిపోయి ఉన్నాయని, ఇవన్నీ మార్కెట్లలోకి వెళ్లనున్నాయని తెలియజేశారు.

  • Loading...

More Telugu News