: వీసాల స్వామికి నీటి కరవు... గండిపేటను వదిలి గంగాళంలోకి చిలుకూరు బాలాజీ!
11 ప్రదక్షిణలు చేసి విదేశీ వీసా కావాలని కోరుకుంటే, వెంటనే వీసా వస్తుందని యువత మనస్ఫూర్తిగా నమ్మే చిలుకూరు బాలాజీకి కూడా నీటి ఎద్దడి ఎదురైంది. శ్రీరామనవమి ఉత్సవాల అనంతరం చక్రస్నానం చేయించేందుకు గండిపేటలో నీరు లేకపోవడంతో, ఓ పెద్ద గంగాళంలో నీటిని తెచ్చి అందులోనే చక్రత్తాళ్వార్ కు స్నానం చేయించడం జరిగింది. గతంలో ఎండాకాలంలోనూ నీరు పుష్కలంగా ఉండగా, చక్రస్నానానికి ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదు. ఈ సంవత్సరం పరిస్థితి మారింది. కాగా, కరవు తీరి వర్షాలు పడాలంటూ, భక్తులు మరో రెండు ప్రదక్షిణలు చేయాలని బాలాజీ దేవాలయం పూజారులు భక్తులను కోరుతున్నారు. గతంలో ఎన్నడూ చక్రస్నానానికి నీరు లభించని పరిస్థితి తలెత్తలేదని పూజారులు వెల్లడించారు.