: మరో 10 వేల కొత్త ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు: ధర్మేంద్ర ప్రధాన్


కొత్త ఆర్థిక సంవత్సరంలోగా మరో 10,000 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లను తీసుకుంటామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యూపీలోని బలియాలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18,000 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని అన్నారు. మూడు నెలల్లో 2,000 మందిని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 8,000 మందిని తీసుకుంటామని ఆయన చెప్పారు. ఉజ్వల యోజన పథకాన్ని మే ఒకటిన ప్రధాని ప్రారంభించనున్నారని ఆయన చెప్పారు. దీని ద్వారా దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామని అన్నారు. 1.13 కోట్ల మంది సబ్సిడీని వదులుకోవడంతో ఆదా అవుతున్న మొత్తాన్ని ఇందుకు వెచ్చిస్తామని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News