: నన్నెవరూ సంప్రదించలేదు...ఎంపీ అనేది గౌరవం: సలీంఖాన్


రాజ్యసభ సభ్యత్వం కోసం తనను ఎవరూ సంప్రదించలేదని ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత సలీమ్ ఖాన్ తెలిపారు. బీజేపీ తనను సంప్రదించిందని వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆయన చెప్పారు. రాజ్యసభకు ఎంపీగా వెళ్లడాన్ని గౌరవంగా భావిస్తానని ఆయన తెలిపారు. అయితే ఇంత వరకు రాజ్యసభకు పంపిస్తామంటూ తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడొకవేళ ఎవరైనా అలాంటి అవకాశం కల్పిస్తే, ఆలోచించాల్సి వస్తుందని ఆయన అన్నారు. తన వయసు పైబడుతుండడంతో అలాంటి అవకాశం గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. కాగా, సలీం ఖాన్ మరో రచయిత జావెద్ అఖ్తర్ తో కలిసి 'షోలే', 'మిస్టర్ ఇండియా', 'జంజీర్' వంటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయితగా పని చేశారు. ఆయన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సొహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ ల తండ్రి కావడం విశేషం.

  • Loading...

More Telugu News