: 90 ఏళ్ల ఆ మతగురువు చిరకాల వాంఛను నెరవేర్చిన భారత ప్రభుత్వం


భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో క్రైస్తవ మిషనరీలో పని చేసేందుకు ఇండియాకు వచ్చిన ఫాదర్ గుస్సీ ఫ్రెడెరిక్ సోపెనా (90) చిరకాల కోరికను ఎట్టకేలకు భారత ప్రభుత్వం తీర్చింది. స్పెయిన్ కు చెందిన ఫాదర్ గుస్సీ రోమన్ క్యాథలిక్ చర్చి విభాగం సోసైటీ ఆఫ్ జీసస్ లో పేదలకు సేవలందించేందుకు 22 ఏళ్ల వయసు (1947)లో భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ముంబై, థానే, నాసిక్, రైగాడ్ జిల్లాల్లో పేదలకు సేవలందిస్తూ వస్తున్నారు. కాగా, గత 38 ఏళ్లుగా ఆయన భారతీయ పౌరుడిననిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చివరికి నిన్న ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్ శేఖర్ చాన్నే తన కార్యాలయంలో గుస్సీ ఫ్రెడెరిక్ కు భారత పౌరసత్వం తాలూకు పత్రాలను అందజేశారు. భారతీయుడుగా గుర్తింపు పొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 68 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నానని చెప్పిన ఆయన, ఇలాంటి దేశాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన 'భారత్ మాతాకీ జై' అని నినదించడం విశేషం!

  • Loading...

More Telugu News