: బీసీసీఐ డే-నైట్ 'టెస్ట్‌మ్యాచ్' ప్రణాళికలు... ఉత్సాహం కనబరుస్తోన్న న్యూజిలాండ్
టెస్టు మ్యాచ్‌లకు ప్రజాదరణ పెంచేందుకు బీసీసీఐ ఈ ఏడాది నిర్వహించ తలపెట్టిన డే-నైట్ టెస్ట్‌మ్యాచ్ పట్ల న్యూజిలాండ్ ఉత్సాహాన్ని కనబరుస్తోంది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్, టీమిండియా మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమైంది. అయితే, తమతో నిర్వహించ తలపెట్టిన డే-నైట్ టెస్టు మ్యాచ్ పట్ల పూర్తి వివరాలను అందించాలని బీసీసీఐను న్యూజిలాండ్ క్రికెట్ కోరింది. డే-నైట్ టెస్ట్‌మ్యాచ్ వేదికలోని సదుపాయాలపై వివరాలు ఇవ్వాలని సూచించింది. స్టేడియంలోని లైటింగ్ క్వాలిటీపైన, ఆట సమర్థవంతంగా నిర్వహించే తీరుపైన, ప్రాక్టీస్ చేసుకునే అవకాశాలపైన తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది. న్యూజిలాండ్ క్రికెటర్లతో, టీమ్ మేనేజ్‌మెంట్‌తో బీసీసీఐ ఓసారి చర్చించాలని సూచించింది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో ఒక డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడాలని నిర్ణయించామని, ఈ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను ఉపయోగిస్తామని ఇటీవలే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీనికంటే ముందు ఒక మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా ఆడతారని పేర్కొన్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌తో గాలిలో తేమ, భారత పిచ్‌లపై స్పిన్నర్ల బౌలింగ్, లైటింగ్ క్వాలిటీ తదితర అంశాలను పరిశీలించనున్నారు.