: వివాదంలో కెప్టెన్ కూల్!... కరవులోనూ స్విమ్మింగ్ పూల్ కోసం రోజూ 15 వేల లీటర్ల నీటి వినియోగం


టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ నెల ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. కలిసి రాలేదనే కంటే అతడిని సమస్యల్లోకి నెట్టేసిందని చెబితే సరిపోతుందేమో. ఈ నెలలోనే స్వదేశంలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక అతడి నాయకత్వంలో ఐపీఎల్ లోకి అడుగు పెట్టిన పూణే జట్టు వరుస పరాజయాలను చూస్తోంది. ఇక మొన్నటిదాకా ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన అతడు సోషల్ మీడియా కారణంగా ఆ పదవి నుంచి తప్పుకుని పెద్ద ఆదాయాన్నే కోల్పోయాడు. ఇక తాజాగా నేటి ఉదయం రాంచీలో ఓ పెద్ద వార్త కలకలం రేపుతోంది. రాంచీ సహా దేశమంతా తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతుంటే... రాంచీలోని తన ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ కోసం ధోనీ రోజుకు 15 వేల లీటర్ల నీటిని వాడేస్తున్నాడట. ఈ మేరకు అతడి ఇరుగు పొరుగు నేటి ఉదయం తీవ్ర ఆరోపణలు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News