: వేలానికి 'హాయ్ ల్యాండ్'!... అగ్రిగోల్డ్ కీలక ఆస్తి విక్రయానికి సీఐడీ గ్రీన్ సిగ్నల్


నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతం అమరావతికి కూతవేటు దూరంలో విజయవాడ-గుంటూరు మధ్య సకల హంగులతో, నిత్యం పర్యాటకుల సందడితో అలరారుతున్న ‘హాయ్ ల్యాండ్’ గుర్తుందిగా. ఇటీవల రాజధాని రైతులతో నేరుగా మాట్లాడేందుకు కారులో హైదరాబాదు నుంచి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... స్వల్ప బ్రేక్ కోసం ఇక్కడే ఆగారు. అంతేకాదండోయ్... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరిట అగ్రిగోల్డ్ నిర్వాహకులు రాసిచ్చేసిన ఆస్తిగా కూడా దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఆ రిసార్టే.. హాయ్ ల్యాండ్. అదే అగ్రిగోల్డ్ ఆస్తుల్లోని కీలక ఆస్తి. భారీ ధరే పలకనున్న ఈ రిసార్ట్ తాజాగా వేలానికి వచ్చేయనుంది. ఈ మేరకు ఈ రిసార్ట్ ను వేలం వేయండంటూ ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టు నియమించిన కమిటీకి నివేదించారు. దీంతో హాయ్ ల్యాండ్ ను వేలానికి పెట్టేందుకు ఆ కమిటీ రంగం సిద్ధం చేస్తోంది. మరి వేలంలో ఈ ‘హాయ్ ల్యాండ్’ ఎవరి చేతికి చిక్కుతుందో చూడాలి. ఎంత ధర పలుకుతుందోనన్న విషయంపైనా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News