: రాజ్ భవన్ చేరుకున్న వైఎస్ జగన్... మరికాసేపట్లో గవర్నర్ తో భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అధికారిక నివాసం రాజ్ భవన్ చేరుకున్నారు. కాస్సేపటి క్రితం లోటస్ పాండ్ లోని తన ఇంటి నుంచి పార్టీ నేతలతో కలిసి బయలుదేరిన జగన్... నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకే ఆయన రాజ్ భవన్ వచ్చారు. మరికాసేపట్లో గవర్నర్ తో భేటీ కానున్న జగన్... తన పార్టీ టికెట్ పై విజయం సాధించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు.