: టీడీపీలోకి మరో 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు?... టీడీపీ నేతల ప్రచారంతో ఆందోళనలో వైసీపీ
ఏపీలో విపక్ష వైసీపీ తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరిపోయారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా మరికాసేపట్లో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయన మరికాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ కానున్నారు. వెనువెంటనే ఆయన టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలు మరో ప్రచారాస్త్రాన్ని విసిరారు. ఇంకా 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని, వారితో తాము జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయన్న ఈ ప్రచారంతో వైసీపీలో తీవ్ర ఆందోళన నెలకొంది.