: ఈ కోటీశ్వరుడు కాస్త భిన్నం...రోబోలతో షాపింగ్ చేస్తాడు!
కోటీశ్వరులు ఎవరైనా షాపింగ్ కు వెళ్లేటప్పుడు తన వెంట బాడీ గార్డులను ఉంచుకుంటారు. వారు రక్షణ వ్యవహారాలు చూడడంతో పాటు యజమాని కొన్న వస్తువులు పట్టుకునేందుకు కూడా పనికొస్తారు. చైనాలో ఓ కోటీశ్వరుడు మాత్రం కాస్త విభిన్నం. సెక్యూరిటీకి బదులు ఎనిమిది హ్యూమనాయిడ్ రోబోలను వెంటేసుకుని తిరుగుతున్నాడు. అది కూడా తన రక్షణ బాధ్యతలు చూసేందుకు కాదు. తను షాపింగ్ చేసిన వస్తువులను పట్టుకునేందుకు మాత్రమే ఆయన వాటిని వెంటేసుకుని వెళ్తుండడం విశేషం. ఇటీవల తన రోబోలతో కలిసి జ్యుయలరీ షాప్ కు షాపింగ్ కు వెళ్లిన సదరు కోటీశ్వరుడ్ని చూసిన షాపు వాళ్లు నివ్వెరపోయారట. ఆయన ఠీవీగా నడుస్తుండగా వెనుక రోబోలు నగలు పట్టుకుని రావడం చూసిన పౌరులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారట. చైనాలోని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో ఎక్కడ చూసినా హ్యూమనాయిడ్ రోబోలే కనబడుతున్నప్పటికీ, ఒక మనిషికి సహాయంగా రోబోలు ఉండడం విడ్డూరమేనని అక్కడ వారు కామెంట్ చేస్తున్నారు.