: బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థిపై పంచ్ లు విసిరిన కెనడా ప్రధాని


బాక్సింగ్ రింగ్ లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ ప్రత్యర్థిపై పంచ్ లు విసురుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో ఆయన రాజకీయాలు వదిలేశారా? అంటూ పలువురు ఆరాతీయడం ప్రారంభించారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న ట్రూడ్ అక్కడి గ్లియాన్సన్ జిమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గతంలో ప్రావీణ్యం ఉన్న బాక్సింగ్ కళను ఆయన ప్రదర్శించారు. అంతేకాదు, అక్కడి యువకులకు బాక్సింగ్ పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా రెడ్ స్లీవ్ లెస్ టాప్ తో కనిపించిన ఆయన కుడి భుజంపై టాటూ కూడా వుంది. ఈ సందర్భంగా తీసిన పోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News