: వ్యవసాయంలో విప్లవం సాధించాలంటే ప్లాస్టిక్ అవసరం: సీఎం చంద్రబాబు
వ్యవసాయంలో విప్లవం సాధించాలంటే ప్లాస్టిక్ అవసరమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో సిపెట్ శాశ్వత భవనానికి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, హన్స్ రాజ్ గంగారాం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దైనందిన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా ఉందని, నాగరికతలో ప్లాస్టిక్ ఒక భాగమైపోయిందని అన్నారు. మంత్రి అనంతకుమార్ కృషి వల్ల ఎక్కడా యూరియా కొరత లేదని అన్నారు. బిందు సేద్యం, తుంపర సేద్యంలో ప్లాస్టిక్ వినియోగిస్తున్నామని, ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు కోసం మల్లవల్లిలో 250 ఎకరాలు కేటాయిస్తామన్నారు. మెరుగైన పద్ధతుల్లో ప్లాస్టిక్ వాడకానికి సిపెట్ కృషి చేస్తుందని, విశాఖపట్టణంలో 500 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.