: రఘు మాస్టర్ దంపతులను ఆశీర్వదించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ దంపతులను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆశీర్వదించారు. రఘు, గాయని ప్రణవిల వివాహ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించానని, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానని ఎస్పీ బాలు పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన వారి వివాహ విందుకు హాజరైన ఆయన ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. రఘు దంపతులతో ఉన్న ఫొటోను కూడా ఫేస్ బుక్ లో ఉంచారు.

  • Loading...

More Telugu News