: హృతిక్, కంగనా వివాదంలో కొత్త ట్విస్ట్
బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. హృతిక్ రోషన్ ఈ మెయిల్ అకౌంట్ నుంచి కంగనాకు ఒక్క ఈ మెయిల్ కూడా వెళ్లలేదని ఫోర్సెనిక్ నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో కంగనా రనౌత్ ఈ మెయిల్ అకౌంట్ నుంచి 6 నెలల వ్యవధిలో 3 వేల ఈ మెయిల్స్ వెళ్లాయని ఫోరెన్సిక్ నివేదిక తేటతెల్లం చేసింది. నకిలీ ఈ మెయిల్ అకౌంట్ తో కంగనా రనౌత్ ను ఎవరో బోల్తా కొట్టించారని ఫోరెన్సిక్ విభాగం అభిప్రాయపడింది. ఆమెకు మెయిల్స్ వచ్చిన హెచ్ఆర్ రోషన్@జీమెయిల్.కామ్ తో హృతిక్ కు ఏ విధమైన సంబంధం లేదని ఫోరెన్సిక్ నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. అదే సమయంలో హృతిక్ రోషన్ ఫోన్ కాల్స్ ను కూడా పోలీసు విభాగం పరిశీలించింది. ఏడేళ్లలో కేవలం నాలుగు సార్లే హృతిక్ ఆమెకు కాల్ చేయడం విశేషం. కంగనాను కలిసేందుకు హృతిక్ పారిస్ వెళ్లలేదని ఆయన పాస్ పోర్టు కాపీలను బట్టి తెలుస్తోందని ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారని డీఎన్ఏ పత్రిక కథనం ప్రచురించింది.