: షిర్డీ సాయి హుండీలో విలువైన వజ్రాలు
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా హుండీలో లక్షల రూపాయల విలువ చేసే వజ్రాలను వేశారు. ఈ విషయాన్ని షిర్డీ సాయి సంస్థాన్ అధికారులు తెలిపారు. ఓ ప్యాకెట్ లో చుట్టి వజ్రాలను హుండీలో వేసినట్లు చెప్పారు. వీటి విలువను నిర్ధారించేందుకు గాను ముంబయి నుంచి కొంతమంది జ్యువెలరీ డిజైనర్లను పిలిపించామని, ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. హుండీలో వేసిన వజ్రాల విలువ సుమారు రూ.85 లక్షలు ఉంటుందని తేలింది. ఈ సందర్భంగా వజ్రాల వ్యాపారి నరేశ్ మెహతా మాట్లాడుతూ, మొదట ఈ వజ్రాలను చూసినప్పుడు అంతగా ఖరీదు చేసేవి కాదనుకున్నామని, తీరా పరీక్షించిన తర్వాత అవి చాలా విలువైనవని తేలిందని చెప్పారు. ఈ వజ్రాలను ఏం చేయాలనే విషయమై బాంబే హైకోర్టును సంస్థాన్ అధికారులు సంప్రదించనున్నట్లు సమాచారం.